Site icon NTV Telugu

Chennai Super Kings: ఎందుకయ్యా మీకు అంత కంగారు.. మేమే అన్ని విషయాలు అప్‌డేట్‌ చేస్తాం

Sck

Sck

Chennai Super Kings: వచ్చే ఏడాది ఐపీఎల్‌ కి ముందు మినీ ఆక్షన్ జరగనుంది. ఈలోపు ఓ ఐదుగురు ప్లేయర్లను వదిలి పెట్టేందుకు ఫ్రాంచైజీలకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని వదిలి పెడుతుందో అనే విషయంపై క్రికెట్ పండితులు అంచనా వేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్ నుంచి రిలీజ్ అయ్యే ఐదుగురి ఆటగాళ్లు అయినా సామ్ కరన్, దీపక్ హుడా, విజయ్‌ శంకర్, రాహుల్ త్రిపాఠి, డేవన్ కాన్వే పేర్లను క్రిక్‌బజ్‌ తెలిపింది.

Read Also: Trump Health : ట్రంప్ హెల్త్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు.. వయసు పెరుగుతున్నా.. అది మాత్రం…

అయితే, ఓవర్సీస్‌ ప్లేయర్ల లిస్టులో కాన్వే, కరన్ ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు షాక్ అయ్యారు. ఓపెనర్‌గా కాన్వే చాలా దూకుడుగా ఆడతాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సామ్ కరన్ జట్టు విజయాల్లో కీ రోల్ పోషించగలడు. కానీ, గత సీజన్‌లో వీరిద్దరూ తేలిపోవడం సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు రుచించలేదు.. అందుకే, వీరిని పక్కన పెడుతుందని ఐపీఎల్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, దానిపై సీఎస్కే యాజమాన్యం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది.

Read Also: Padi Kaushik Reddy: బీఅర్ఎస్ నుంచి గెలిచి వేరే పార్టీలో చేరితే.. వారి ఇంటి పై వెయ్యి మందితో దాడి చేయిస్తా

ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు యాజమాన్యం కాస్త ఘాటుగా కాకుండా.. ఫన్నీ మ్యానర్‌తో ఓ పోస్టును పెట్టింది. ‘ఎవరూ కంగారు పడొద్దు.. అన్ని విషయాలపై మేమే అప్‌డేట్‌ చేస్తామని పేర్కొంది. ఐదుగురిని రిలీజ్‌ చేయడం వల్ల సీఎస్కే దగ్గర భారీ మొత్తమే మిగుతుంది. అలాగే, రవిచంద్రన్ అశ్విన్‌ ఐపీఎల్‌కూ వీడ్కోలు పలకడంతో అతడి విలువ కూడా మిలిగిపోనుంది.

Exit mobile version