CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్‌కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!

  • ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయం
  • ఏకంగా 103 పరుగుల తేడాతో విక్టరీ
  • సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్‌కే
Csk History

Csk History

Chennai Super Kings Biggest IPL Win: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై 104 పరుగులకే కుప్పకూలడంతో చెన్నై ఏకంగా 103 పరుగుల తేడాతో గెలిచింది. ఇది చెన్నై జట్టు చరిత్రలోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ముంబైకి కంచుకోట అయిన వాంఖడే స్టేడియంలో ఈ బిగ్గెస్ట్ విక్టరీ నమోదు కావడం విశేషం. ఈ గెలుపుతో సీఎస్‌కే రికార్డుల జాబితాలో మరో గొప్ప మైలురాయి చేరింది.

ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన భారీ విజయం 2015లో నమోదైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 97 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ముంబైపై 103 పరుగుల తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 93 పరుగుల తేడాతో, 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 92 పరుగుల తేడాతో, 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 91 పరుగుల తేడాతో విజయాలు సాధించింది. ఈ విజయాలు సీఎస్‌కే జట్టు స్థిరత్వం, వ్యూహాత్మక ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచాయి.

కీలక మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలవగల సామర్థ్యం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉందని మరోసారి రుజువైంది. బలమైన బ్యాటింగ్, పటిష్ట బౌలింగ్, సమన్వయంతో కూడిన టీమ్ వర్క్.. ఈ మూడు అంశాలే చెన్నై విజయాల వెనుక ప్రధాన కారణాలు. ఐపీఎల్‌లో సీఎస్‌కే సాధించిన ఈ భారీ విజయాల రికార్డులు జట్టును మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. భవిష్యత్తులో కూడా ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. మరిన్ని రికార్డులు చెన్నై ఖాతాలో చేరడం ఖాయం. ఇక ముంబైపై విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ మెరుగయ్యాయి. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో మూడు విజయాలతో పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది.