Rinku Singh: రింకూ తప్పకుండా భారత్ తరఫున ఆడుతాడు

Rinku Singh

Rinku Singh

Australia Former Allrounder David Hussey Says Rinku Singh Will Definitely Play For India In Future: ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లలో రింకూ సింగ్ ఒకడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు.. ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకి తనవంతు కృషి అందిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో.. చివరి 5 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు, అతని వరుసగా ఐదు సిక్సులు బాది తన జట్టుని గెలిపించుకున్నాడు. ఈ మ్యాచ్ తరువాత అతడు ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లోనూ మెరుగ్గా రాణిస్తుండటంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రింకూ సింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో రింకూ సింగ్‌ ఖచ్చితంగా భారత్‌ తరపున ఆడుతాడని జోస్యం చెప్పాడు.

×
×
Ad

స్టార్‌స్పోర్ట్స్ షోలో హస్సీ మాట్లాడుతూ.. ‘‘రింకూ సింగ్‌లో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. అతడు దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. 2018 నుంచి కేకేఆర్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్రమంగా తన ఆటతీరుని మెరుగుపరచుకున్నాడు. కేకేఆర్ సైతం అతనికి మద్దతుగా నిలిచింది. ఈ సీజన్‌లో దుమ్ముదులిపేస్తున్న రింకూ సింగ్.. భవిష్యత్తులో తప్పకుండా భారత్ తరఫున ఆడుతాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ 251 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 58. 2018 నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్న రింకూ.. ఈ సీజన్‌లో జట్టుకి అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. మరి.. డేవిడ్ హస్సీ చెప్పినట్టు, భవిష్యత్తులో భారత్ తరఫున రింకూ సింగ్ ఆడగలడా? అతడు తన ఆటను మరింత మెరుగుపరచుకొని, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!