RCB Player: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆర్సీబీ క్రికెట్ ప్లేయర్..

  • యష్ దయాల్ రహస్య వివాహం..
  • గ్రేటర్ నోయిడాలో కుటుంబ సమక్షంలో పెళ్లి..
  • వివాదాల మధ్య బెయిల్ పొందిన దయాల్..
Yash Dayal

Yash Dayal

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు స్టార్ పేసర్ యష్ దయాల్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. మైదానంలో తన బౌలింగ్‌తో కంటే, వ్యక్తిగత జీవితంలోని వివాదాలు.. తాజాగా ఆయన రహస్య వివాహం గురించి విశేషాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యష్ దయాల్ ఐపీఎల్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత ఏడాది కాలంగా ఆయనపై లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే ఆయన యూపీ టీ-20 లీగ్ 2025లో కూడా పాల్గొనలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పెళ్లి వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read:Gen Z: భారతీయ వ్యాపార రంగంలో ‘జెన్ జీ’ ప్రభంజనం.. భవిష్యత్తు మార్కెట్ అంచనాలు ఇవే..

యష్ దయాల్ వివాహం ఫిబ్రవరి 4వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగినట్లు సమాచారం. అయితే ఈ వివాహం గురించి నెల రోజుల వరకు బయటి ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. క్రికెటర్లు కానీ, స్నేహితులు కానీ ఎవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. యష్ దయాల్ వివాహం చేసుకున్న యువతి పేరు శ్వేత పుండిర్. ఆమె వృత్తిరీత్యా ఒక కంటెంట్ క్రియేటర్. ఇటీవల సోషల్ మీడియాలో యష్‌తో కలిసి ఆమె చేసిన ఒక రీల్ వైరల్ అవ్వడంతో వీరి బంధంపై స్పష్టత వచ్చింది.

Also Read:Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు

జనవరి 2026లో యష్ దయాల్ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కింది కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించడంతో అరెస్ట్ భయం నెలకొంది. అయితే… రాజస్థాన్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పెద్ద ఊరట లభించింది. ఈ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆయన కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఈ బెయిల్ ఆయనకు మేలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో యష్ దయాల్ ఆడతారా లేదా అనే సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను పక్కన పెట్టి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యష్ దయాల్.. తిరిగి మైదానంలోకి ఎప్పుడు వస్తారో అని అభిమానులు వేచి చూస్తున్నారు.