ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 4 మ్యాచ్ లు ఆడి, 3 విజయాలు సాధించి ఊపుమీదున్నాయి. మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమస్థానానికి ఎగబాకుతుంది.
అందుకే రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో జిమ్మీ నీషామ్ ను తీసుకున్నారు. బౌల్ట్ స్వల్పగాయంతో బాధపడుతున్నాడు. అటు గుజరాత్ జట్టులో రెండు మార్పులు చేశారు. దర్శన్ నల్కండే స్థానంలో యశ్ దయాళ్… సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ ఆడుతున్నారు. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ 12 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో గిల్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే అవసరం లేని పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో వేడ్ సగం క్రీజు దాటి వచ్చేశాడు. అప్పటికే డుసెన్ బంతి అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. తర్వాత వరుసగా రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్(2) రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ నిర్లక్ష్యంగా షాట్ ఆడి శాంసన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.
