IPL Auction 2023 Live Updates: ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లే రికార్డులు బ్రేకయ్యాయి. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో శామ్ కరణ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ముంబై 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్‌ను లక్నో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.
-
నవీన్ ఉల్ హక్‌ను కొనుగోలు చేసిన లక్నో
ఆప్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్‌ను రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
రూట్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోయ్ రూట్‌ను రూ.కోటికి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
-
షకీబ్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబుల్ హసన్‌ను రూ.1.5 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
-
లిట్టన్ దాస్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా
బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్‌ను రూ.50 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
-
అకిల్ హుస్సేన్, అన్మోల్ ప్రీత్‌సింగ్‌లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
వెస్టిండీస్ బౌలర్ అకిల్ హుస్సేన్‌ను రూ.కోటికి, టీమిండియా దేశవాళీ ఆటగాడు అన్మోల్ ప్రీత్‌సింగ్‌ను రూ.20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
మురుగన్ అశ్విన్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్
టీమిండియా స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌ను రూ.20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
-
రోసౌను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌను రూ.4.6 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
-
ఆడమ్ జంపాను కొనుగోలు చేసిన రాజస్థాన్
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను రెండో రౌండ్‌లో రూ.1.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
-
నితీష్ కుమార్‌రెడ్డిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
టీమిండియా దేశవాళీ ఆటగాడు నితీష్ కుమార్‌రెడ్డిని కనీస ధర రూ.20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
సోనూ యాదవ్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు
టీమిండియా దేశవాళీ ఆటగాడు సోనూ యాదవ్‌ను కనీస ధర రూ.20 లక్షలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది.
-
నెహాల్ వధేరాను కొనుగోలు చేసిన ముంబై
టీమిండియా దేశవాళీ ఆటగాడు నెహాల్ వధేరాను రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
-
శివం సింగ్‌ను కొనుగోలు చేసిన పంజాబ్
టీమిండియా దేశవాళీ ఆటగాడు శివం సింగ్‌ను రూ.20 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
జోషువా లిటిల్‌ను కొనుగోలు చేసిన గుజరాత్
ఐర్లాండ్ ఆటగాడు జోషువా లిటిల్‌ను రూ.4.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా జోషువా లిటిల్ కోసం పోటీ పడింది.
-
డేవిడ్ వీస్‌ను కోనుగోలు చేసిన కోల్‌కతా
నమీబియా ఆటగాడు డేవిడ్ వీస్‌ను రూ.కోటికి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
-
విష్ణు వినోద్‌ను కొనుగోలు చేసిన ముంబై
టీమిండియా దేశవాళీ వికెట్ కీపర్ విష్ణు వినోద్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
-
రజన్ కుమార్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు
టీమిండియా దేశవాళీ ఆటగాడు రజన్ కుమార్‌ను రూ.70 లక్షలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది.
-
ఫెరీరాను కొనుగోలు చేసిన రాజస్థాన్
దక్షిణాఫ్రికా దేశవాళీ ఆటగాడు డోనోవన్ ఫెరీరాను రూ.50 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
-
అమిత్ మిశ్రాను కొనుగోలు చేసిన లక్నో
టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రాను కనీస ధర రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
చావ్లాను కొనుగోలు చేసిన ముంబై
టీమిండియా స్పిన్నర్ పీయూష్ చావ్లాను కనీస ధర రూ.50 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది
-
జేమీసన్‌ను కొనుగోలు చేసిన చెన్నై
న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమీసన్‌ను రూ.కోటికి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
డానియల్ శామ్స్‌ను కొనుగోలు చేసిన లక్నో
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ శామ్స్‌ను రూ.75 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
షెపర్డ్‌ను కొనుగోలు చేసిన లక్నో
వెస్టిండీస్ ఆటగాడు రొమారియో షెపర్డ్‌ను రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
విల్ జాక్స్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు
ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్‌ను రూ.3.2 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని దక్షిణాఫ్రికా స్టార్ డస్సెన్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రాస్సీ వాండర్ డస్సెన్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
-
మనీష్ పాండేను కొనుగోలు చేసిన ఢిల్లీ
టీమిండియా ఆటగాడు మనీష్ పాండేను రూ.2.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది.
-
హిమాన్షు శర్మను కొనుగోలు చేసిన బెంగళూరు
టీమిండియా దేశవాళీ బౌలర్ హిమాన్షు శర్మను రూ.20 లక్షలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది.
-
ముఖేష్ కుమార్‌కు రూ.5.5 కోట్లు
టీమిండియా బౌలర్ ముఖేష్ కుమార్‌ను రూ.5.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
-
శివం మావికి రూ.6 కోట్లు
టీమిండియా బౌలర్ శివం మావిని రూ.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
-
యష్ ఠాకూర్‌ను కొనుగోలు చేసిన లక్నో
టీమిండియా దేశవాళీ ఆటగాడు యష్ ఠాకూర్‌ను రూ.45 లక్షలకు లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
ఉపేంద్ర యాదవ్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
టీమిండియా దేశవాళీ ఆటగాడు ఉపేంద్ర యాదవ్‌ను రూ.25 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
వైభవ్ అరోరాను కొనుగోలు చేసిన కోల్‌కతా
టీమిండియా దేశవాళీ ఆటగాడు వైభవ్ అరోరాను రూ.45 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
-
జగదీషన్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా
టీమిండియా దేశవాళీ వికెట్ కీపర్ ఎన్.జగదీషన్‌ను రూ.90 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
-
నిషాంత్ సింధును కొనుగోలు చేసిన చెన్నై
టీమిండియా దేశవాళీ ఆటగాడు నిషాంత్ సింధును రూ.60 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
శ్రీకర్ భరత్‌ను కొనుగోలు చేసిన గుజరాత్
టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌ను రూ.1.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది.
-
వివ్రాంత్ శర్మకు రూ.2.6 కోట్లు
టీమిండియా దేశవాళీ ఆటగాడు వివ్రాంత్ శర్మను రూ.2.6 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
వ్యాస్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
టీమిండియా దేశవాళీ ఆటగాడు సమర్థ్ వ్యాస్‌ను కనీస ధర రూ.20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
-
షేక్ రషీద్‌ను కొనుగోలు చేసిన చెన్నై
టీమిండియా ఆటగాడు షేక్ రషీద్‌ను కనీస ధర రూ.20 లక్షలకు చెన్నై సూపర్‌కింగ్స్ కొనుగోలు చేసింది.
-
మయాంక్ మార్కండేను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
టీమిండియా యువ ఆటగాడు మయాంక్ మార్కండేను కనీస ధర రూ.50 లక్షలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
-
రషీద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను రూ.2 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
ప్రముఖ క్రికెటర్లను కొనుగోలు చేయని జట్లు
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, వెస్టిండీస్ క్రికెటర్ అకీల్ హుస్సేన్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ, ఆప్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబుర్ రెహ్మాన్‌లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
-
అమ్ముడుపోని ఆడమ్ మిల్నే
న్యూజిలాండ్ క్రికెటర్ ఆడమ్ మిల్నేను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
-
ఇషాంత్ శర్మను కొనుగోలు చేసిన ఢిల్లీ
టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మను కనీస ధర రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
-
జై రిచర్డ్‌సన్‌ను కొనుగోలు చేసిన ముంబై
ఆస్ట్రేలియా బౌలర్ జై రిచర్డ్ సన్‌ను రూ.1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
-
ఉనద్కట్‌ను కొనుగోలు చేసిన లక్నో
టీమిండియా బౌలర్ జైదేవ్ ఉనద్కట్‌ను రూ.50 లక్షలకు లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది.
-
టోప్లీకి రూ.1.9 కోట్లు
ఇంగ్లండ్ క్రికెటర్ టోప్లీని రూ.1.9 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కొనుగోలు చేసింది.
-
జోర్డాన్, బ్యాంటన్‌ను కొనుగోలు చేయని జట్లు
ఇంగ్లండ్ క్రికెటర్లు టామ్ బ్యాంటన్, క్రిస్ జోర్డాన్‌లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.
-
ఫిల్ సాల్ట్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ
ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని కుశాల్ మెండిస్
శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.
-
క్లాసెన్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌ను రూ.5.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
నికోలస్ పూరన్‌కు రూ.16 కోట్లు
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్‌ను రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.