Site icon NTV Telugu

IPL: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. అన్ని జట్ల పూర్తి వివరాలు

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్-2022 మెగావేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 204 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.551.7 కోట్లను ఖర్చు చేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను ఖర్చు చేసింది. రెండో స్థానంలో దీపక్ చాహర్ నిలిచాడు. అతడిని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్(కోల్‌కతా నైట్‌రైడర్స్) రూ.12.25 కోట్లు, నాలుగో స్థానంలో శార్దూల్ ఠాకూర్ (ఢిల్లీ క్యాపిటల్స్) రూ.10.75 కోట్లు, ఐదో స్థానంలో హర్షల్ పటేల్ (బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్) రూ.10.75 కోట్లు ఉన్నారు.

అటు దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో కూడా ముంబై ఇండియన్స్ జట్టు అతడిని దక్కించుకోగా తుది జట్టులో అవకాశం మాత్రం కల్పించలేదు. మరి ఈ ఏడాది లీగ్‌లో అయినా అర్జున్ టెండూల్కర్‌కు ఆడే అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్క్వాడ్:

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పూర్తి స్క్వాడ్:

చెన్నై సూపర్‌కింగ్స్ పూర్తి స్క్వాడ్:

గుజరాత్ టైటాన్స్ పూర్తి స్క్వాడ్:

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి స్క్వాడ్:

లక్నో సూపర్‌జెయింట్స్ పూర్తి స్క్వాడ్:

పంజాబ్ కింగ్స్ పూర్తి స్క్వాడ్:

Exit mobile version