Site icon NTV Telugu

IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్‌డేట్స్

బెంగళూరు వేదికగా ఐపీఎల్-2022 మెగా వేలం జరుగుతోంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి.

★ శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్
★ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.5 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ.7.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
★ దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను రూ.9.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్
★ న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
★ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని రూ.6.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
★ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు వేలంలో దక్కించుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
★ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను రూ. 6.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
★ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకు వేలంలో దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
★ టీమిండియా ఆటగాడు మనీష్ పాండేను రూ.4.6 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
★ వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్‌ను రూ.8.5 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ టీమిండియా ఆటగాడు రాబిన్ ఉతప్పను రూ.2 కోట్లకు వేలంలో దక్కించుకున్న చెన్నై సూపర్‌కింగ్స్
★ ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌ను రూ.2 కోట్లకు వేలంలో దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
★ టీమిండియా ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
★ వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావోను రూ.4.4 కోట్లకు వేలంలో దక్కించుకున్న చెన్నై సూపర్‌కింగ్స్
★ టీమిండియా ఆటగాడు నితీష్ రానాను రూ.8 కోట్లకు వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
★ వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ.8.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్‌జెయింట్స్
★ టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్‌ను రూ.10.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
★ టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు వేలంలో దక్కించుకున్న లక్నో సూపర్‌జెయింట్స్

Exit mobile version