అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ఆరంభం అయింది. అబుదాబీ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 2.30కు వేలం పక్రియ మొదలైంది. సెట్ 1 బ్యాటర్లలో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ వేలంకు రాగా.. ఏ ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేయడనికి ఆసక్తి చూపలేదు. కనీస ధర రూ.2 కోట్లు అయినా అన్‌సోల్డ్‌గా మిగిలాడు. దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
టీమిండియా ఆటగాడు పృథ్వీ షాకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో నిరాశ ఎదురైంది. పృథ్వీ షా కనీస ధర రూ.75 లక్షలు కాగా.. అన్‌సోల్డ్ అయ్యాడు. పృథ్వీని కొనేందుకు ఏ ప్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఐపీఎల్ 2025 వేలంలో కూడా పృథ్వీ అన్‌సోల్డ్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో భరత జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ టోర్నీలలో అడపాదడపా ఆడుతున్నా.. నిలకడగా ఆడడం లేదు. అందుకే ప్రాంచైజీలకు అతడిపై నమ్మకం పోయింది. వేలం చివరలో ఎవరైనా తీసుకుంటారో చూడాలి.
