IPL 2026: దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు.. ఐపీఎల్‌లో ‘ధురంధర్‌’లు వీరే!

  • ఐపీఎల్‌లో దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు
  • అగ్రస్థానంలో వైభవ్ సూర్యవంశీ
  • ఐపీఎల్‌లో 'ధురంధర్‌'లు వీరే
Ipl 2026

Ipl 2026

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓపెనర్లు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. దూకుడైన బ్యాటింగ్‌తో నిమిషాల వ్యవధిలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంటారు. అందుకే ఆటగాళ్ల స్ట్రైక్ రేట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఐపీఎల్ 2026 ఆరంభం నేపథ్యంలో లీగ్‌లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన ఓపెనర్ల జాబితా ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం. ఈ జాబితాలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచాడు. అతను 206 స్ట్రైక్ రేట్‌తో అద్భుత ప్రదర్శన కనబరిస్తూ టాప్‌లో నిలిచాడు.

అత్యధిక స్ట్రైక్ రేట్‌ ఉన్న జాబితాలో ప్రియాన్ష్ ఆర్య (179), ఫిల్ సాల్ట్ (179) రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ట్రావిస్ హెడ్ 170 స్ట్రైక్ రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ (162), యశస్వి జైస్వాల్ (152), ప్రభసిమ్రన్ సింగ్ (151) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్ (142), సంజు శాంసన్ (139) కూడా తమ దూకుడైన ఆటతో జట్టుకు మంచి ఆరంభం అందిస్తున్నారు. ఈ జాబితా చూస్తే ఐపీఎల్‌లో ఓపెనర్ల పాత్ర ఎంత కీలకమో స్పష్టమవుతోంది. వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న బ్యాటర్లు జట్టుకు పవర్‌ప్లేలోనే గేమ్‌ను తమవైపు తిప్పేస్తున్నారు. ఈ సీజన్‌లో ఈ ప్లేయర్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: India vs Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం, కొత్త యుగానికి నాంది!

అత్యధిక స్ట్రైక్ రేట్‌ లిస్ట్:
వైభవ్ సూర్యవంశీ – 206
ప్రియాంష్ ఆర్య – 179
ఫిల్ సాల్ట్ – 179
ట్రావిస్ హెడ్ – 170
అభిషేక్ శర్మ – 162
యశస్వి జైస్వాల్ – 152
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ – 151
మిచెల్ మార్ష్ – 142
సంజు శాంసన్ – 139