IPL 2022 : నేడు గుజరాత్‌తో తలపడనున్న బెంగళూరు..

Gt Vs Rcb

Gt Vs Rcb

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే నేడు ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదిక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు తలపడునుంది. అయితే ఈ మ్యాచ్‌ ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఈ మ్యాచ్‌ 67వ మ్యాచ్‌ కాగా.. ఇప్పటికే గుజరాత్‌ ప్లే ఆఫ్‌కు చేరుకుంది. కానీ.. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్‌ ఆశలన్నీ.. ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ 3 మ్యాచ్‌లో ఓడి.. 10 మ్యాచ్‌లో విజయం సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ సీజన్‌లో 13 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. 6 మ్యాచ్‌ ఓటమి చవిచూసి.. 7 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. 14 పాయింట్లతో పట్టికలో 5వస్థానంలో ఉంది.