ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్‌గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను మాత్రం రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ 863 పరుగులు సాధించి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా బట్లర్‌కే దక్కింది. అంతేకాకుండా అత్యధిక ఫోర్లు (83), అత్యధిక సిక్సర్లు (45) కొట్టిన రికార్డు కూడా బట్లర్‌నే వరించింది. పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అతడికే దక్కింది.
మరోవైపు ఈ సీజన్‌లో 27 వికెట్లు తీసిన చాహల్ పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ సొంతం చేసుకున్నాడు. అతడు 13 మ్యాచ్‌లలో కలిపి 22 వికెట్లు తీశాడు. 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి మెప్పించడంతో త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికయ్యాడు. అటు పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ఎవిన్ లూయిస్‌కు దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ క్యాచ్‌ను ఒంతిచేత్తో అద్భుతంగా అందుకోవడంతో లూయిస్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. కాగా సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డును బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దినేష్ కార్తీక్ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో 183.33 స్ట్రయిక్ రేటును దినేష్ కార్తీక్ నమోదు చేశాడు. చివరగా ఫెయిర్ ప్లే అవార్డు మాత్రం రాజస్థాన్ జట్టును వరించింది.
