Site icon NTV Telugu

IPL 2022 : టాస్‌ గెలిచిన ఆర్సీబీ.. బౌలింగ్‌ చేస్తారట..

నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్‌లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి కేకేఆర్‌ జోష్‌లో ఉండగా.. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి కూడా పరాజయం పాలైన ఆర్‌సీబీ కాస్త ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలో కోల్‌కత్తాపై విజయం సాధించి బోణీ కొట్టాలని బెంగళూరు ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే గతేడాది జరిగిన 2 మ్యాచ్‌లలో ఆర్సీబీ ఆధిక్యం సాధించినప్పటికీ కేకేఆర్‌ విజయం సాధించింది. దీంతో ఈ రోజు కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీల మధ్య జరిగే మ్యాచ్‌పై క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version