NTV Telugu Site icon

రెజ్లింగ్‌: ముగిసిన అన్షు కథ‌…ఆశలు రేపిన ఫొగాట్‌…

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్లు ఆశ‌లు రేపుతున్నారు.  53 కేజీల మ‌హిళా విభాగంలో ఇండియా రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు.  స్వీడ‌న్‌కు చెందిన మ్యాట్‌స‌న్‌ను 7-1 తేడాతో ఓడించారు.  ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిప‌త్యం సాధించింది.  వీలైనంత వ‌ర‌కూ దూకుడుగా ఆడుతూ ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించింది.  మొద‌టి పిరియ‌డ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్‌, రెండో పీరియ‌డ్‌లో 2 స్కోర్ మాత్ర‌మే చేసింది.  అయితే, స్వీడ‌న్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవ‌లం ఒక్క పాయంట్ మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది.  ఇక ఇదిలా ఉంటే,  మ‌రో యువ రెజ్ల‌ర్ అన్షు మాలిక్ క‌థ మ‌రోలా ఉన్న‌ది.  రెపిచేజ్ ద్వారా వ‌చ్చిన అవ‌కాశాన్ని అమె వినియోగించుకోలేక‌ పోయింది.  రష్యా క్రీడాకారిణి కొబ్‌లొవా చేతిలో 1-5 తేడాతో ఓటమిపాలైంది.  తొలి పిరియ‌డ్‌లో కొబ్‌లొవా 1 పాయంట్ మాత్ర‌మే చేయ‌గా, రెండో పిరియ‌డ్‌లో కొబ్‌లొవా 2,2 పాయంట్లు సాధించింది. అయితే, అన్షు కేవ‌లం ఒక్క పాయింట్ మాత్ర‌మే చేసి నిరాశ ప‌రిచింది. 

Read: “డి44″లో ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్