Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. శనివారం మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు అతడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన “New Chapter” పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ టీమ్ ఇండియాలో అరంగేట్రానికి సంకేతమా? లేక కొత్త బ్యాట్ స్పాన్సర్షిప్ ఒప్పందానికి సూచనా? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
శుక్రవారం రాత్రి వైభవ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బ్యాట్‌ను పైకెత్తి సంబరాలు చేసుకుంటున్న ఫొటోను షేర్ చేశాడు. ఆ చిత్రంపై “New Chapter” అనే రెండు పదాలు మాత్రమే ఉండటంతో దాని వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది చర్చనీయాంశమైంది. అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అభిమానులు తమదైన రీతిలో అర్థాలు వెతుకుతున్నారు. మరోవైపు.. ఈ పోస్ట్‌కు ముందు టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని మరింత పెంచాయి. మాంచెస్టర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సంజు సామ్సన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల స్థానాలను తొందరగా మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుపై విశ్వాసం కొనసాగుతుందని చెప్పడంతో రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
అయితే అదే రోజు రాత్రి వైభవ్ చేసిన “New Chapter” పోస్ట్ కొత్త ఊహాగానాలకు తెరలేపింది. పలువురు అభిమానులు దీనిని అతని అంతర్జాతీయ అరంగేట్రానికి సంకేతంగా భావిస్తుండగా, మరికొందరు ఇది కొత్త స్పాన్సర్షిప్ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన కావచ్చని అంటున్నారు. ఇటీవల వైభవ్ ‘హీరో’ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌తో కనిపించడం కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఇంతకు ముందు అతడు ఎస్ఎస్ బ్రాండ్ బ్యాట్‌ను ఉపయోగించేవాడు. దీంతో “New Chapter” అనేది కొత్త బ్యాట్ స్పాన్సర్‌తో కుదిరిన ఒప్పందానికి సంబంధించిన సంకేతమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఈ పోస్ట్‌కు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అలాగే టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కూడా దీనిపై స్పందించలేదు. దీంతో ఈ పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది. ఇప్పుడు అందరి దృష్టి శనివారం మాంచెస్టర్‌లో జరిగే రెండో టీ20 మ్యాచ్‌పై ఉంది. ఆ మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం లభిస్తే “New Chapter” అనే పదాలకు కొత్త అర్థం లభించే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం రాకపోతే, ఈ వైరల్ పోస్ట్ వెనుక మరో కథ ఉందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!