Site icon NTV Telugu

WTC Prize Money: WTC ఛాంపియన్స్‌, రన్నరప్‌కు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీ.. ఐసీసీ ప్రకటన

Wtc Prize Money

Wtc Prize Money

WTC Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీని ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC).. WTC ఛాంపియన్స్ మరియు రన్నరప్‌లకు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రైజ్ పూల్‌ను ఐసీసీ ఈ రోజు ప్రకటించింది.. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) విజేతలకు 3.6 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం.. 30.79 కోట్ల రూపాయలు అందజేయనుంది.. ఇది గత ఎడిషన్ల ప్రైజ్ మనీ కంటే రెట్టింపు.. ఇక, రన్నరప్‌కు 2.1 మిలియన్ల యూఎస్‌ డాలర్లు.. అంటే ఇండియా కరెన్సీలో 17.96 కోట్లు లభిస్తాయి, ఇది గత సంవత్సరం ఓడిపోయిన ఫైనలిస్టులు 2023లో పొందిన డబ్బు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషంగా చెప్పుకోవాలి..

Read Also:Karnataka: క్రికెట్ బాల్ కోసం టీచర్‌ని కత్తితో పొడిచిన వ్యక్తి..

అయితే, జూన్ 11వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.. 2023లో భారత క్రికెట్ జట్టును ఓడించి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అప్పట్లో 1.6 మిలియన్లు యూఎస్‌ డాలర్లు సంపాదించగా, రన్నరప్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 800,000 యూఎస్‌ డాలర్లు అందుకుంది. అయితే, “టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐసీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రైజ్‌ మనీని ఐసీసీ భారీగా పెంచి ఉంటుందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?

డబ్ల్యూటీసీ సైకిల్‌లో దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు పాకిస్తాన్‌లపై 2-0 స్వదేశీ సిరీస్ విజయాలతో అత్యున్నత స్థాయిలో ముగించింది, 69.44 శాతం పాయింట్లు సాధించింది.. ఇక, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో ముగించగా, ఎక్కువ సమయం పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా 50.00తో ముగించింది. టీమిండియా WTC ఫైనల్ ఆడకపోవడం ఇదే మొదటిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను, ముఖ్యంగా లార్డ్స్‌లో కాపాడుకునే అవకాశం లభించడం పట్ల మేం చాలా గర్వపడుతున్నాం… గత రెండు సంవత్సరాలుగా ఫైనల్‌కు చేరుకోవడానికి చాలా కష్టపడి పనిచేసిన వారందరికీ ఇది నిదర్శనం, ఇది మనందరికీ గొప్ప గౌరవం అని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పేర్కొన్నారు.. ఇక, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ, టెస్ట్ క్రికెట్ యొక్క ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకుంటారు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆటలో ఒక కీలకమైన ఫార్మాట్‌.. ఈ మెగా మ్యాచ్‌కు లార్డ్స్ సరైన వేదిక.. అంతేకాదు.. ఆస్ట్రేలియాపై మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అని వెల్లడించారు..

Exit mobile version