Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు మరో స్టార్ ప్లేయర్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 35 ఏళ్ల విలియమ్సన్ తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండరు. అయితే, 16 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జట్టుకు సేవలందించిన విలియమ్సన్, అన్ని ఫార్మాట్లలో కలిపి దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా తన కెరీర్‌ను ముగించారు. రిటైర్మెంట్పై స్పందించిన ఆయన, ఈ నిర్ణయం గురించి కొంతకాలంగా ఆలోచిస్తున్నానని, గత కొన్ని రోజులుగా ఇదే సరైన సమయమని స్పష్టంగా భావించానని తెలిపారు.
భావోద్వేగ సందేశంతో రిటైర్మెంట్ ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌పై నాకు ఎప్పుడూ అపారమైన అభిరుచి ఉండేది. న్యూజిలాండ్ తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లో నా శక్తి మేరకు కృషి చేశాననే గర్వం ఉంది. పూర్తి నిబద్ధతతో కొనసాగలేనప్పుడు తప్పుకోవడమే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను. నా ఇష్టానుసారం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అని విలియమ్సన్ పేర్కొన్నారు. తాను జట్టును వీడుతున్నప్పటికీ న్యూజిలాండ్ క్రికెట్ భవిష్యత్తుపై ఎంతో ఆశావహంగా ఉన్నానని ఆయన చెప్పారు. జట్టులో అపార ప్రతిభ ఉందని, ప్రత్యేక విజయాలు సాధించాలనే తపన యువ ఆటగాళ్లలో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ జట్టు తన హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉంటుందని భావోద్వేగంగా వెల్లడించారు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన కేన్
విలియమ్సన్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 378 మ్యాచ్‌లు ఆడారు. ఈ కాలంలో 19,346 పరుగులు సాధించడమే కాకుండా 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఈ గణాంకాలు ఆయనను న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టాయి. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా విలియమ్సన్ విశేష సేవలు అందించారు. 2016 నుంచి 2024 వరకు న్యూజిలాండ్ జట్టును నడిపించిన ఆయన నాయకత్వంలో జట్టు రెండు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకుంది. మూడు సార్లు సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడమే కాకుండా 2021లో జరిగిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై..
గత ఏడాది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విలియమ్సన్, ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటూ తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలికారు. విలియమ్సన్ రిటైర్మెంట్పై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ప్రశంసలు కురిపించారు. “కేన్‌తో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ఎంత ప్రత్యేకమైన వ్యక్తియో తెలుసు. ఆయన ప్రభావం కేవలం గణాంకాల్లోనే కాదు, జట్టు సంస్కృతి, ప్రమాణాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అద్భుతమైన ఆటగాడు, గొప్ప సహచరుడు, అద్భుత నాయకుడు, క్రికెట్‌కు గొప్ప రాయబారి” అని కొనియాడారు.
చిరస్మరణీయ కెరీర్‌కు ముగింపు పలికిన క్రికెట్ దిగ్గజం
వ్యక్తిగత అవార్డుల విషయానికి వస్తే, 2015లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2019లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందుకున్నారు. అదనంగా నాలుగు సార్లు సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ గెలుచుకుని న్యూజిలాండ్ క్రికెట్లో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరిచారు. కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్తో ప్రపంచ క్రికెట్ ఒక గొప్ప బ్యాటర్‌ను, న్యూజిలాండ్ క్రికెట్ ఒక అద్భుత నాయకుడిని కోల్పోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!