India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Afghanistan: భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తమ జట్టును ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మూడు టీ20 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్ కోసం ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. భారత్‌తో జరిగే సిరీస్ ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా మారనుంది. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును మరింత బలోపేతం చేయడం, కీలక సిరీస్‌ల్లో విజయాలు సాధించడం ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
నవీన్-ఉల్-హక్ రీఎంట్రీ
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ప్రధాన ఆకర్షణగా ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి రావడం నిలిచింది. భుజం గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న నవీన్ పూర్తి ఫిట్నెస్తో తిరిగి వచ్చాడు. అతని రాకతో ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే నైబ్ మిడిల్ ఆర్డర్‌కు అదనపు బలాన్ని అందించనున్నాడు.
Also Read
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్‌కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
యువ వికెట్ కీపర్‌కు తొలిసారి అవకాశం
దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ వికెట్ కీపర్-బ్యాటర్ నూర్ రహ్మాన్‌కు తొలిసారి ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టులో చోటు లభించింది. ప్రధాన వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు బ్యాకప్‌గా నూర్ రహ్మాన్ వ్యవహరించనున్నాడు.
స్పిన్ బౌలింగ్‌పైనే ప్రధాన ఆశలు
ఆఫ్ఘనిస్తాన్‌కు ఎప్పటినుంచో ప్రధాన బలంగా ఉన్న స్పిన్ బౌలింగ్ విభాగంలో ఈసారి కూడా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రషీద్ ఖాన్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్ వంటి స్పిన్నర్లు భారత పిచ్‌లపై తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అనుభవజ్ఞుడైన మహ్మద్ నబీ కూడా జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించగల నబీ జట్టు సమతుల్యతకు ఉపయోగపడనున్నాడు.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ పూర్తి జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహ్మాన్ (వికెట్ కీపర్), సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతీ, ముజీబ్ హజ్మద్, నూర్ అహ్మద్, ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, నవీన్-ఉల్-హక్.. ఇక రిజర్వ్ ఆటగాళ్లు: ఇజాజ్ అహ్మద్జాయ్, షాహిదుల్లా కమల్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్
1వ టీ20: సెప్టెంబర్ 13, 2026 – అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, న్యూఢిల్లీ
2వ టీ20: సెప్టెంబర్ 15, 2026 – అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, న్యూఢిల్లీ
3వ టీ20: సెప్టెంబర్ 17, 2026 – అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, న్యూఢిల్లీ
ACB Names Squad for the T20I Series against India
Kabul, August 24, 2026: Afghanistan Cricket Board’s National Selection Committee has finalized the Afghanistan National Team squad for the upcoming three-match T20I series against India, scheduled to be played from September 13… pic.twitter.com/GPvqLP2rFT
— Afghanistan Cricket Board (@ACBofficials) August 24, 2026
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!