NTV Telugu Site icon

బీజింగ్ ఒలింపిక్స్‌లో క‌రోనా క‌రక‌లం…

బీజింగ్ వింట‌ర్ ఒలింపిక్స్ ఫిబ్ర‌వ‌రి 4 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు బీజింగ్ న‌గ‌రాన్ని జీరో క‌రోనా న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చైనా ప్ర‌య‌త్నం చేసింది. క‌రోనా నిబంధ‌న‌ల‌కు క‌ఠినంగా అమలు చేసింది. బీజింగ్ చుట్టుప‌క్కల పెద్ద న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌ను అమ‌లు చేసింది. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ప్రారంభ‌మైన బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా క‌ల‌క‌లం రేగింది. తాజాగా బీజింగ్‌లో 45 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Read: వెరైటీ మాస్క్‌: మాస్క్‌పెట్టుకొని తినొచ్చు… తాగొచ్చు…

ఇందులో 26 మంది విదేశాల నుంచి వ‌చ్చిన క్రీడాకారులు ఉన్నారు. కాగా, జ‌న‌వ‌రి 23 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 12 వేల మంది క్రీడాకారులు బీజింగ్‌కు చేరుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 353 మందికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఒలింపిక్స్ ప్రారంభం రోజునే 45 మందికి కరోనా సోక‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. క్రీడాకారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా టెస్టులు నిర్వ‌హిస్తూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.