NTV Telugu Site icon

పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా సారా టేలర్‌

క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అవుతుంది. టెస్టు క్రికెట్‌ నుంచి మొదలు పరిమిత ఓవర్లు, టీ20 దాకా అన్ని అద్భుతాలే మరీ.. ఇలా అద్భుతాలు చేస్తుంది కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు అంత మంది అభిమానులు ఉన్నారు. మరీ.. తాజాగా క్రికెట్‌ చరిత్రలోనే మొదటి సారిగా పురుషుల క్రికెట్‌ జట్టుకు ఓ మహిళా కోచ్‌గా సేవలు అందించనుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సారా టేలర్‌.. పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. టీ10 ఫ్రాంచైజీ క్రికెట్‌లో భాగంగా ఆమె అబుదాబి జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనుంది. ఇంగ్లాండ్‌ సాధించిన రెండు వరల్డ్‌ కప్‌లు, ఒక టీ20 వరల్డ్‌ కప్‌ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది.

సారా టేలర్ టీ20 లీగ్‌ల్లో మాత్రం పాల్గొంటూ బిజీగా ఉంటోంది ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ‘వెల్ష్ ఫైర్’ జట్టుకి ఆడుతున్న సారా టేలర్, వుమెన్స్ టీ20కప్‌లో సుసెక్స్, నార్తన్ డైమండ్స్ జట్లకి ఆడుతోంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోటోషూట్ నిర్వహించింది సారా టేలర్. ఒంటి మీద నూలుపోగు లేకుండా బ్యాటు పట్టుకుని షాట్ ఆడుతున్నట్టు సారా టేలర్ ఇచ్చిన ఫోజులు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.

మహిళా క్రికెటర్లలో అత్యంత అందగత్తెల్లో ఒకరైనా సారా టేలర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని సారా టేలర్, 2019లో తన మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్‌గా ప్రకటించింది. మానసిక సమస్యలతోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సారా టేలర్, ప్రొఫెషనల్ వికెట్ కీపింగ్‌లో అత్యధిక క్యాచులు అందుకున్నవారిలో ఒకరిగా ఉన్నారు.