Site icon NTV Telugu

Karnataka: కిక్ బాక్సింగ్‌లో విషాదం.. సింగిల్ పంచ్‌కు యువ బాక్సర్ మృతి

Nikhil Suresh

Nikhil Suresh

కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కే1 కిక్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విషాదకరంగా ముగిసింది. ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు కిక్ బాక్సర్ నిఖిల్ సురేష్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ముఖంపై పంచ్ దెబ్బ గట్టిగా తగిలడంతో రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. నిఖిల్ సురేష్ స్వస్థలం మైసూరు. అతడి వయసు 23 ఏళ్లు. ఈ నేపథ్యంలో కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Jos Buttler: కోహ్లీపై విమర్శలు.. బట్లర్ ఘాటు వ్యాఖ్యలు

కాగా రాష్ట్ర స్థాయి కే1 కిక్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బౌట్‌లో తలపడే సమయంలో నిఖిల్ సురేష్ ముఖంపై ప్రత్యర్థి గట్టిగా పంచ్ విసిరాడు. దీనితో రింగ్‌లోనే కుప్పకూలాడు. అనంతరం అతణ్ని నాగరభావిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రిలో నిఖిల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కాగా తన కుమారుడు కిక్ బాక్సర్‌గా ఎదగాలనే ఆశలతో బెంగళూరు ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఇక ఎప్పటికీ తిరిగిరాడని నిఖిల్ తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version