U19 T20 World Cup: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ వచ్చే నెల 14న దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అండర్ 19 మహిళల ప్రపంచకప్ కోసం అమెరికా 15 మంది సభ్యులతో తన టీమ్‌ను ప్రకటించింది. అయితే అమెరికా టీమ్‌ను చూసిన వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా టీమ్‌లో అందరూ భారత సంతతి అమ్మాయిలే ఉన్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ టీమ్‌లో కెప్టెన్ గీతిక కొడాలి, వైస్ కెప్టెన్ అనికరెడ్డి, భూమిక భద్రిరాజు, లాస్య ప్రియ ముళ్లపూడి, సాయి తన్మయ్, కస్తూరి వేదాంతం తెలుగు అమ్మాయిలే.
Read Also: Andhra Pradesh: సెలవుల క్యాలెండర్ విడుదల.. ఉగాది, వినాయకచవితికి వాళ్లకు నో హాలీడే
జట్టులో మిగిలిన వారిలో అదితి, దిశ, ఇషాని, జీవన, పూజ గణేష్, పూజ షా, రీతూ సింగ్, స్నిగ్ధ, సుహాని, తారానమ్ చోప్రా భారత మూలాలు ఉన్న క్రికెటర్లు కావడం గమనించాల్సిన విషయం. ఈ జట్టుకు వెస్టిండీస్ క్రికెట్ మాజీ దిగ్గజం శివనారాయణ్ చందర్‌పాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇది అమెరికా జట్టు కాదని భారత్-బి జట్టు అని పలువురు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ టోర్నీలో గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా, గ్రూప్-బి తరఫున ఇంగ్లండ్, పాకిస్థాన్, రువాండా, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇండోనేసియా, వెస్టిండీస్.. గ్రూప్-డిలో సౌతాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ, భారత్ తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లోని టాపర్ నేరుగా సెమీఫైనల్ దశకు చేరుతుంది. భారత జట్టుకు తెలుగు అమ్మాయిలు త్రిష (తెలంగాణ), ఎండీ షబ్నమ్ (విశాఖ) ఎంపికయ్యారు.
1