NTV Telugu Site icon

Shubman Gill: శుబ్మన్ గిల్‌కు అదొక్కటే గతి.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Shubman Gill Trolls

Shubman Gill Trolls

Indian Cricket Fans Trolling Shubman Gill For Failing In West Indies Test Series: మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడపై అభిమానులకు భారీ అంచనాలే ఉంటాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకోరు గానీ, కనీసం ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడినా చాలు, సంతృప్తి పొందుతారు. అలా కాకుండా వరుసగా విఫలమైతే మాత్రం.. ఇక వారిపై నెట్టింట్లో బ్యాండ్ బాజా మొదలుపెడతారు. ఇప్పుడు శుబ్మన్ గిల్‌పై కూడా అలాంటి విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అతడు రెండు మ్యాచ్‌ల్లోనూ ఫెయిల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ శుబ్మన్‌పై మండిపడుతున్నారు.

Wife Attacked Boss: అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య ఏం చేసిందంటే?

తొలుత డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో శుబ్మన్ గిల్ 11 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. విండీస్‌ స్పిన్నర్‌ వారికన్‌ బౌలింగ్‌లో అలిక్‌ అథనాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి.. అతడు పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పుడు ట్రినిడాడ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతడు నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొని, కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. కరేబియన్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ జాషువాకు క్యాచ్‌ ఇచ్చి, మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో.. శుబ్మన్ ఆటతీరుపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అతనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Vaishnavi Chaitanya: బిగ్ బాస్ లోకి ‘బేబీ’.. ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అవుతున్నాయి

‘‘ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. రాహుల్ ద్రవిడ్‌తో శుబ్మన్ మాట్లాడి, ‘ఇకపై అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ స్టేడియంలో జరిగేలా చూడండి, నేను అహ్మదాబాద్‌ పిచ్‌లపై మాత్రమే బాగా బ్యాటింగ్‌ చేయగలను. ఈ సాయం చేయగలరు’ అని అభ్యర్థించి ఉంటాడు’’ అంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. అతడు రాహుల్‌ని రిక్వెస్ట్ చేసి మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నాడు కాబట్టి, దాన్ని ఉద్దేశిస్తూ ఫ్యాన్స్ ఈ కౌంటర్ వేస్తున్నారు. అలాగే.. అహ్మదాబాద్ స్టేడియంలో శుబ్మన్ మూడు సెంచరీలు చేశాడు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. వీటికి సమాధానం ఇవ్వాలంటే, గిల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే.