కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు టీ20ల్లో ఇదే తొలి సిరీస్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యుజువేంద్ర చాహల్
వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), పావెల్, రోస్టన్ ఛేస్, రొమారియో షెపర్డ్, హుసేన్, ఓ.స్మిత్, అలెన్, కాట్రెల్
