సెంచూరియన్ : సెంచురియన్ భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అత్యధికంగా రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు.
Read Also: విశాఖలోనూ న్యూయర్ వేడుకలపై ఆంక్షలు: మనీష్ కుమార్ సిన్హా
సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, మార్కో జాన్సెన్ లు చెరో 4 వికెట్లు తీశారు. లుంగి ఎంగిడి 2 వికెట్లు తీశాడు. అనంతరం చేధనకు దిగిన సౌతాఫ్రికాకు రెండో ఓవర్ లోనే షాక్ తగిలింది. ఒపెనర్ మార్క్రమ్ ఒక్క పరుగు చేసి .. షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రకా వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. పిటర్సన్ 4 పరుగులు, ఎల్గర్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.
