Site icon NTV Telugu

శ్రీలంకతో నేడే రెండో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్..!

India

India

ఇప్పటికే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ-20 సిరీస్‌పై కన్నేసింది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విక్టరీ కొట్టిన భారత జట్టు.. ఇవాళ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.. తొలి పోరులో సూర్యకుమార్‌ యాదవ్‌, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఆకట్టుకోగా.. లంకేయులు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారు. అయితే, మరో మ్యాచ్‌ మిగిలుండగానే శిఖర్‌ ధావన్‌ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో విక్టరీ కొట్టి.. వరుసగా రెండో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

Exit mobile version