Site icon NTV Telugu

IND vs PAK U19 Asia Cup Final: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK U19 Asia Cup Final: అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఐసీసీ మైదానంలో భారత్‌, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఇప్పటి వరకు టోర్నీలో భారత్‌ ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం సాధిస్తూ, ఘన విజయాలు సాధించింది.

Read Also: Kishan Reddy: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ..

ఇక, టోర్నీ ఆరంభంలో యూఏఈ అండర్‌-19 జట్టును ఓడించిన భారత్‌, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. శ్రీలంకను కూడా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటి వరకు టోర్నీలో అత్యుత్తమ జట్టుగా టీమిండియా నిలిచింది. దీంతో ఫైనల్‌లో కూడా భారత జట్టే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Read Also: Pawan Kalyan- YS Jagan: మాజీ సీఎం జగన్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్.. “ఎక్స్‌”లో కీలక పోస్ట్

అయితే, పాకిస్థాన్‌ జట్టును తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను తప్పితే, మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ పాక్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. కీలక సమయాల్లో దాయాది జట్టు తమ అత్యుత్తమ ఆటను బయటకు తీస్తే, ‘బాయ్స్ ఇన్ బ్లూ’కు గట్టి షాక్ ఇవ్వగల సామర్థ్యం వారికి ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ U19 ఫైనల్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత్‌ మరోసారి ట్రోఫీని దక్కించుకుంటుందా ?.. లేక పాకిస్థాన్‌ సంచలన విజయంతో చరిత్ర సృష్టిస్తుందా..? అనే ఉత్కంఠ కొనసాగుతుంది.

తుది జట్లు
భార‌త్: ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీప‌ర్‌), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్

పాకిస్తాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ , అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్‌), హంజా జహూర్ (వికెట్ కీప‌ర్‌), హుజైఫా అహ్సాన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్

Exit mobile version