IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ 20 జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత యువ జట్టు కివీస్‌తో తలపడనుంది. టీ 20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రెండో మ్యాచ్ కూడా రద్దయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: మన దేశంలోని 10 అందమైన బీచ్ రోడ్స్
కాగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తుది జట్టులో స్థానంలో కోసం దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ నెలకొంది. ప్రపంచకప్‌లో సరైన అవకాశాలు దక్కించుకోకపోయిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో వేచి చూడాలి. భవిష్యత్ కెప్టెన్ అవుతాడని భావిస్తున్న పాండ్యా.. ఈ మ్యాచ్‌లో జట్టును ఎలా నడిపిస్తాడో ఉత్కంఠ నెలకొంది. బౌలింగ్‌లో భువనేశ్వర్‌తో పాటు హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ భారాన్ని మోయనున్నారు. చాహల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే ఈ వేదికలో జరిగిన టీ20 మ్యాచ్‌లలో ఏడు తొలి ఇన్నింగ్స్ సగటు 199. పేసర్ల కంటే స్పిన్నర్లకే ఈ స్టేడియంలో మంచి రికార్డు ఉండటం గమనించాల్సిన విషయం.
