India vs New Zealand Match Tickets Available On PayTM: ఈనెల 18వ తేదీన భారత్, న్యూజీల్యాండ్ మధ్య జరగనున్న వన్డే మ్యాచ్‌కి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈసారి టికెట్లను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో ఉంచారు. ఆల్రెడీ పేటీఎంలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 39 వేల టికెట్స్‌ని ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు. ఈరోజు నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్నారు. అయితే.. మైదానంలోకి వెళ్లాలంటే, ఫిజికల్ టికెట్ తప్పనిసరి. ఈ ఫిజికల్ టికెట్స్‌ని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో క్యూఆర్ కోడ్‌తో కలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు జిమ్‌ఖానాలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్మడం వల్ల, అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. ఆన్‌లైన్‌లోనే టికెట్లన్నింటినీ విక్రయానికి పెట్టారు.
Vladimir Putin: ఫూల్స్ చేయొద్దంటూ పుతిన్ ఫైర్.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్
రెండ్రోజుల క్రితమే ఈ టికెట్ల వ్యవహారంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. విడతల వారీగా టికెట్లు అమ్మడం జరుగుతుందన్నారు. జనవరి 13న 6 వేలు, జనవరి 14న 7 వేలు, జనవరి 15న 7 వేలు, జనవరి 16న మిగతా టికెట్లను అమ్మనున్నట్టు తెలిపారు. ఫిజికల్ టికెట్లను జనవరి 15 నుండి 18 వరకు.. ఉదయం 10 నుండి 3 గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకునేవారు కేవలం 4 టికెట్స్ మాత్రమే తీసుకోవాలన్నారు. జనవరి 14న న్యూజీల్యాండ్ టీమ్ హైదరాబాద్‌కి వస్తుందని, 15న సాయంత్రం ప్రాక్టీస్ చేస్తుందని తెలిపారు. అనంతరం జనవరి 16న టీమిండియా హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 18వ తేదీన ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు