భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (107 పరుగులు, 49 బంతుల్లో) బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. నా బ్యాటింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా సాగింది. ఈ రోజు పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగా సహకరించింది. మేము దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం, ఇది చాలా సంతోషంగా ఉంది. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం చాలా ఆనందంగా అనిపించింది.
మైకేల్ బ్రేస్‌వెల్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం గురించి చెప్పాలంటే.. ఈ ఎండ్ నుంచి వీచే గాలి కారణంగా షాట్లు ఆడటం కొద్దిగా సులభంగా ఉంటుందని మేం మాట్లాడుకున్నాం. అయితే బ్రేస్‌వెల్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఏ ఎండ్ నుంచి ఆడుతున్నాడనే దానితో సంబంధం లేకుండా చెలరేగిపోతాడు. ముఖ్యంగా మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, భారత్ చేతి నుంచి మ్యాచ్‌ను మా వైపునకు తిప్పుకోవడానికి ఈ భాగస్వామ్యం చాలా బాగా ఉపయోగపడింది. గత మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం మాకు చాలా బాధ అనిపించింది.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకోవాలనుకున్నాం.. సమిష్టి కృషితో అది సాధ్యమైందని అన్నాడు.
గత ఆరు నెలల నుంచి ఒక ఏడాది కాలంగా నా బ్యాటింగ్ శైలిలో వచ్చిన మార్పుల గురించి చెప్పాలంటే.. క్రికెట్‌లో ఫామ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు బంతి బాగా కనిపిస్తుంది, మరికొన్నిసార్లు సరిగ్గా ఆడలేం. ఈ మంచి ఫామ్‌ను వీలైనంత కాలం కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాను. మైదానంలో సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చూస్తున్నానన్నారు.

