England vs India T20 World Cup 2026 2nd Semi-Final in Mumbai: టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. స్టార్ ప్లేయర్స్ ఉండడంతో ఈ రెండు జట్లు తలపడిన ప్రతి మ్యాచ్ అభిమానులకు థ్రిల్ అందించింది. ఓ మ్యాచ్‌లో బ్యాటర్లు, మరో మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో రసవత్తర పోర్టులు జరిగాయి. గణాంకాల పరంగా చూసినా.. రెండు జట్ల పోరు సమసమంగా సాగిందని చెప్పాలి. గత ఎడిషన్ల ఫలితాలు పరిశీలిస్తే ఒక్కోసారి ఒక్కో జట్టు ఆధిపత్యం చాటింది.
టీ20 ప్రపంచ కప్ 2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే 2009 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ కేవలం 3 పరుగుల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. వరల్డ్ కప్ 2012లో భారత్ 90 పరుగుల తేడాతో గెలిచి మరోసారి ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చూపింది. 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచి భారత్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చాటడంతో రైవల్రీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా టీ20 ప్రపంచ కప్ 2026 పోరుపైనే ఉంది. గత రికార్డులు సమంగా ఉండటంతో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. మార్చి 5న రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరు మళ్లీ క్రికెట్ ప్రపంచాన్ని కట్టిపడేయనుంది.
