NTV Telugu Site icon

India vs Australia ODI: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఆఫ్‌లైన్‌లో విశాఖ వన్డే టికెట్లు

Vizag

Vizag

India vs Australia ODI: భారత్‌ -ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19వ తేదీన విశాఖ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగబోతోంది.. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయించింది ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ).. ఆన్‌లైన్‌లో పెట్టిన ఆరగంటకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి టికెట్లు.. పేటీఎం యాప్, పేటీఎం ఇన్ సైడర్ యాప్, ఇన్ సైడర్. ఇన్ వెబ్‌ల నుంచి టికెట్స్ కొనుగోలు చేశారు క్రికెట్‌ ఫ్యాన్స్‌.. వన్డే మ్యాచ్‌కు సంబంధించిన ఆన్ లైన్ టికెట్ల విక్రయం ముగియడంతో.. ఇక ఆఫ్‌లైన్‌ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.. అయితే, వారు అప్రమత్తం కావాల్సిన సమయం రానే వచ్చింది.. ఈ రోజు ఆఫ్‌లైన్‌లో రెండో వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు విక్రయించనున్నారు.. ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం కోసం విశాఖలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు.. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి, టౌన్ కొత్తరోడ్డులోని ఇందిరా ప్రియదర్శిని మునిసి పల్ స్టేడియం, గాజువాకలో గల రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు చేపట్టనున్నారు.. టికెట్ ధరలు రూ.600, రూ.1,500, రూ. 2000, రూ. 3000, రూ.3,500, రూ. 6000గా నిర్ణయించారు.. ఆన్‌లైన్‌లో టికెట్లకు వచ్చిన డిమాండ్‌ చూస్తే.. ఆఫ్‌లైన్‌ కోసం కూడా భారీగా డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది.. దీంతో.. కౌంటర్ల వద్ద తోపులాట, తొక్కిసలాటలకు తా వివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్‌.. నాల్గో టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం విదితమే.. ఇక. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరగనుండగా.. రెండో వన్డే 19వ తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తారు.. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ మాత్రమే జరిగింది. నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ విశాఖలో జరుగుతుండడంతో.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.