NTV Telugu Site icon

ICC Women’s World Cup: భారత్‌ కీలక మ్యాచ్‌.. బ్యాటింగ్‌ స్టార్ట్..

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్‌ ఆడుతోంది భారత మహిళల జట్టు.. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న మిథాలీ సేన.. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.. ఇక, టాప్‌ 4లో స్థానం దక్కాలంటే మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్‌లో ముందుకు సాగాలంటే.. ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది.. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి నాలుగు పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానానికి పరిమితం అయిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు 4 మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా.. 8 పాయింట్లతో టాప్‌స్పాట్‌లో ఉంది. ఇక, ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తోన్న భారత జట్టు 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?