IND vs AUS 5th T20: ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్. బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక, మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు దూకుడుగా ఆటను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేవలం 4. 5 ఓవర్లలోనే 52 పరుగుల భాగస్వామ్యాన్ని టీమిండియా ఓపెనింగ్ జోడీ చేసింది. క్రీజులో ఉన్న శుభ్ మన్ గిల్ ( 16 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు నాటౌట్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్స్ 23 పరుగులు నాటౌట్) ఉన్నారు. అయితే, మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను అంపైర్లు ఆపేశారు.
Read Also: Predator: Badlands : ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ .. ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్!
అయితే, అభిషేక్ శర్మ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నాథన్ ఎల్లిస్ వేసిన 3.3 ఓవర్‌కు అభిషేక్ భారీ షాట్ ఆడగా.. గాల్లోకి లేచిన బంతిని డ్వార్షుయిస్ అందుకోలేకపోయాడు. నాలుగో ఓవర్‌లో 12 పరుగులు రాగా, చివరి బంతిని అభిషేక్ సిక్సర్‌గా మలిచాడు. 4.5 ఓవర్లకు స్కోరు 52/0గా ఉంది. ఇక, ఈ ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేసింది. బర్త్‌డే బాయ్ తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ రెండింట్లో విజయం సాధించగా.. ఆసీస్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఫలితంగా 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్, గాబాలో మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్ లో విజయం సాధించి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని చూస్తుంది.
