Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడుతూ శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 26, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నాంగేయాలియా ఖరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు.
Also Read
- PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
- IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
- IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
- Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
అనంతరం 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు గుర్బాజ్ (41), ఇబ్రహీం జద్రాన్ (21) మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించినా ఆ తర్వాత వికెట్లు కోల్పోయారు. రహ్మత్ షా ఒక్కడే 79 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక సెదిఖుల్లా అటల్ 42 పరుగులు చేయగా, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (4), రషీద్ ఖాన్ (12) నిరాశపరిచారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, సుందర్, అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!