Site icon NTV Telugu

IND Vs WI: తొలి టీ20లో టీమిండియా టార్గెట్ 158 పరుగులు

కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్‌ ఐదో బంతికే బ్రెండన్ కింగ్‌ (4)ను భువనేశ్వర్ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్‌ పూరన్‌కు 8 పరుగుల వద్ద లైఫ్‌ దొరికింది. అతడిచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో రవి బిష్ణోయ్‌ బౌండరీ లైన్‌ తొక్కేశాడు. దొరికిన అవకాశాన్ని పూరన్‌ చక్కగా వాడుకున్నాడు.

మేయర్స్‌ దూకుడుగా ఆడుతుంటే నికోలస్ పూరన్ నిలకడగా ఆడాడు. రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం అందించాడు. విండీస్ జట్టులో నికోలస్ పూరన్ 43 బంతుల్లోనే 61 (సిక్సర్లు 5, ఫోర్లు 4) పరుగులు చేశాడు. మేయర్స్ 31, పొలార్డ్ 24 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. హర్షల్ పటేల్ 2, భువనేశ్వర్, చాహల్, చాహర్ తలో వికెట్ తీశారు.

Exit mobile version