భారత క్రికెట్ జట్టు 2026 జూన్ చివర్లో యూకే పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా ముందుగా ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ సెలక్షన్ కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టును ప్రకటించింది. అదే సమయంలో 2026 ఆసియా క్రీడల కోసం భారత జట్టును కూడా వెల్లడించింది.
జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల్లో ఆడనున్నాడు
2026 ఆసియా క్రీడల కోసం భారత జట్టు స్క్వాడ్‌ను కూడా ప్రకటించారు, అయితే అందులో కొన్ని మార్పులు ఉన్నాయి. ఆ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు జస్ప్రీత్ బుమ్రాను స్క్వాడ్‌లో చేర్చారు.
వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ పిలుపు
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన యువ బ్యాటర్ Vaibhav Suryavanshiకు తొలిసారిగా భారత సీనియర్ జట్టులో చోటు లభించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో జాతీయ జట్టు తలుపులు తట్టడంలో విజయవంతమయ్యాడు.
శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ
BCCI ప్రకటించిన జట్టు ప్రకారం, Shreyas Iyerను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించారు. అలాగే Tilak Varmaకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. కొత్త నాయకత్వంలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎలా రాణిస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కూడా ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా మారనుంది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు స్క్వాడ్
వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, సంజు శాంసన్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
ఆసియా క్రీడల జట్టు
వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, సంజు శాంసన్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ సింగ్ రానా,
Presenting #TeamIndia‘s T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026

