Site icon NTV Telugu

మొదటి టెస్ట్‌ లో భారత్‌ ఆధిక్యం

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టుకి వరుణుడు విలన్‌గా మారేలా కనిపిస్తున్నాడు. కీలక సమయంలో జోరున కురుస్తోన్న వర్షం.. ఆటను రద్దయ్యేలా చేస్తోంది. రెండో రోజు, మూడు రోజు దాదాపు సగం ఆట రద్దైంది. దీంతో ఈ టెస్ట్‌ ఫలితం తేలుతుందా..? లేక వరుణుడి దెబ్బకు డ్రాగా ముగుస్తుందా..? అన్న అనుమానాలు ఉన్నాయి.

నాటింగ్‌హామ్‌ టెస్ట్‌లో మూడో రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి భారత్‌ 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. అంతకుముందు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ , జడేజాలు హాఫ్‌ సెంచరీలు చేశారు. చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా ధాటిగా ఆడటంతో 278 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు, అండర్సన్‌ నాలుగు వికెట్లతో చెలరేగారు.

39 ఏళ్ల వయసులో జిమ్మీ అండర్సన్‌ అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మన కుంబ్లే గణాంకాలను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో జిమ్మీ నాలుగు వికెట్లు తీయడంతో టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు అండర్సన్‌. ప్రస్తుతం అండర్సన్‌ తీసిన వికెట్లు 620. ముత్తయ్య 800 వికెట్లతో మొదటి స్థానంలో… షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

Exit mobile version