NTV Telugu Site icon

India vs West Indies 2nd ODI: విండీస్‌ ముందు చిన్న టార్గెట్…!

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియా… రెండో వన్డేలో కాస్త చిన్న టార్గెట్‌నే ప్రత్యర్థి జట్టుముందు ఉంచింది.. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.. సూర్యకుమార్‌ యాదవ్‌ 64 పరుగులతో.. కేఎల్‌ రాహుల్‌ 49 పరుగులతో రాణించారు.. రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రారంభించడంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కెమర్ రోచ్ 5 పరుగుల వద్ద రోహిత్‌ను అవుట్ చేయడంతో ఓపెనింగ్ స్టాండ్ ఎక్కువసేపు నిలవలేకపోయింది.. విరాట్ కోహ్లి (18), రిషబ్ పంత్ (18) ఆ తర్వాత రెండో వికెట్‌కి 30 పరుగులు జోడించారు.. ఒడియన్ స్మిత్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ 83 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 49 పరుగుల వద్ద రాహుల్ వికెట్‌ కోల్పోయాడు.. వారు మొత్తం 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేకపోవడంతో.. భారీ స్కోర్‌ చేయలేపోయిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 237/9 పరుగులు చేసింది.

Read Also: Unemployment: షాకింగ్‌.. నిరుద్యోగంతో 25 వేల మంది ఆత్మహత్య..