ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై భారత్ ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా మెంటార్ ధోని సలహాలను కోహ్లీ లైట్ తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ధోనీ ఎప్పటికప్పుడు తన సలహాలను యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషాన్‌తో విరాట్ కోహ్లికి పంపే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కాస్త సమయం దొరికినా.. వాటర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు పట్టుకొని ఫీల్డ్‌లోకి పరుగెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్.. ధోనీ సందేశాన్ని విరాట్‌కు చేరవేసే ప్రయత్నం చేశాడు.అయితే కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉన్నట్లు మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది.
కోహ్లి, పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తర్వాత ఎవరు బ్యాటింగ్‌కు రావాలో క్రీజులో నుంచే డ్రెస్సింగ్ రూమ్‌కు సందేశం పంపించాడు విరాట్. రైట్‌హ్యాండ్ అయిన తాను ఔటైతే హార్దిక్, పంత్ ఔటైతే జడేజా రావాలన్నది అతని ప్లాన్. అందుకు తగినట్లే పంత్ ఔటవగానే జడేజా వచ్చాడు. ఈ విషయంలో ధోనీ ఇచ్చిన సూచనను కోహ్లి పట్టించుకోలేదు. 15 ఓవర్లు పూర్తయినా కూడా కోహ్లి, జడేజా స్కోరు వేగాన్ని పెంచలేకపోయారు. ఇది భారీ స్కోరు చేసే అవకాశాన్ని దెబ్బతీసింది.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ఇక ఫీల్డింగ్ సమయంలోనూ గాయపడిన పాండ్యా స్థానంలో ఇషాన్ కిషన్‌నే ధోనీ పంపించాడు. అప్పుడు కూడా అతడు ధోనీ సందేశాలను విరాట్‌కు చేరేవేసే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి మాత్రం తన నిర్ణయాలనే ఫాలో అయ్యాడు. తొలి నాలుగు ఓవర్లు నలుగురు బౌలర్లకు ఇవ్వడమన్నది కోహ్లి నిర్ణయమే. ఇది బెడసికొట్టి.. మొదట్లోనే పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్ టీమిండియా కోల్పోయింది. మొత్తానికి కోహ్లీ సొంత నిర్ణయాలతోనే పాక్‌పై ఓటమిని మూటకట్టుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయ్. దీనిపై కోహ్లీ స్పందిస్తాడో లేదో… చూడాలి.
- Tags
- india
- Pakisthan
- T 20 world Cup
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు