టీ-20 వరల్డ్ కప్ : ఇంగ్లండ్ ను చిత్తు చేసిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌పై ఏడు వికెట్లతేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్ పై చేయి సాధించింది.ప్రధానంగా భారత బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడడంతో ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే విజయభేరీ మోగించింది భారత్.టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయభేరి మోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్,కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు.
తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం అందించి మంచి పునాది వేశారు. మంచి ఊపుమీదున్న రాహుల్… మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కోహ్లీ 11 పరుగులే చేసి లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్‌తో జట్టుకట్టిన రిషబ్ పంత్ నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచాడు. చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు అవసరం కాగా, ఒక్క ఓవర్లలోనే భారత్ 20 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యతో కలిసి రిషబ్‌పంత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో జానీ బెయిర్ స్టో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన మొయిన్ అలీ ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి మూడు, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు.
Also Read
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Tags
- england
- india
- T 20 world Cup
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!