Site icon NTV Telugu

IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్‌ మ్యాచ్‌.. భారత్ ఘన విజయం

West Indies Vs India

West Indies Vs India

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మూడో రోజున విజయం సాధించింది. కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించి భారత్‌ను విజయ పంథాలో నడిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా నాలుగు వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read : Enquiry: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ

ఇక రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుండి ఢిల్లీలో జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ తో రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ల పరంగా ఏకంగా మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించాడు. జడేజా తన మొత్తం సిక్సర్ల సంఖ్యను 79కి పెంచుకోగా ధోని 78 సిక్సర్లు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒక భారతీయుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును వీరేంద్ర సెహ్వాగ్ కలిగి ఉన్నాడు. సెహ్వాగ్ 91 సిక్సర్లు కొట్టాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 90 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 88 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక మరోపక్క కెఎల్ రాహుల్ 9 సంవత్సరాల తర్వాత భారతదేశంలో టెస్ట్ సెంచరీ సాధించాడు. మొదటి రోజు హాఫ్ సెంచరీతో తిరిగి వచ్చిన కెఎల్ రాహుల్ రెండవ రోజు సెంచరీ సాధించాడు. కెఎల్ రాహుల్ తన 11వ టెస్ట్ సెంచరీని సాధించి వెస్టిండీస్‌పై భారత జట్టుకు పట్టు దొరికేలా చేశాడు.

Exit mobile version