NTV Telugu Site icon

భారత్ ఆల్ ఔట్.. కివీస్ టార్గెట్…?

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ తరపున పంత్(41) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులు చేయగా కివీస్ 249 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే విలియమ్సన్ సేన 139 పరుగులు చేయాలి. అయితే ఆటకు ఇదే ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఒకవేళ టీం ఇండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఈరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ ను ఆల్ ఔట్ చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.