IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs SL 2nd Test: కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభమయింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే భారత్ ప్లేయింగ్ 11పై ముందునుంచి వస్తున్న వార్తలే నిజమయ్యాయి. సీనియర్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం చేశాడు.
టాస్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘గాలెతో పోలిస్తే కొలంబో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా కనిపిస్తోంది. గాలె పిచ్ కూడా చాలా బాగుండేది. కానీ ఆట సాగుతున్న కొద్దీ కొంచెం నెమ్మదించి, బంతి తిరగడం మొదలైంది. ఈ పిచ్ కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. మొదటి రెండు, మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నా. మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ కొంత నెమ్మదించి, స్పిన్నర్లకు టర్న్ లభించే అవకాశం ఉంది’ అని చెప్పాడు.
Also Read
- Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
- Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
- Virat Kohli vs Pakistan: భారత్ - పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
- Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
రెండో టెస్టులో టీమిండియా ఒక కీలక మార్పుతో బరిలోకి దిగింది. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కుల్దీప్కు ఇన్ఫెక్షన్ రావడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోలేదని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. కుల్దీప్ స్థానంలో 33 ఏళ్ల సారంశ్ జైన్ టెస్టు క్రికెట్లో భారత తరఫున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు పొందిన సారంశ్‌కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా నిరూపించుకునే అవకాశం లభించింది. అతడి అరంగేట్రంతో భారత జట్టు బౌలింగ్ మరింత బలపడింది. శ్రీలంక రెండు మార్పులు చేసింది. కమిల్ మిశ్రా అరంగేట్రం చేశాడు. లనే దినేష్ చండిమాల్ ప్లేస్‌లో పసిందు సూరియబండారా వచ్చాడు.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
శ్రీలంక: లాహిరు ఉదారా, కమిల్ మిషారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!