భారత జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడని, అతని స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని సిరీస్‌కు ఎంపిక చేసినా ప్లేయింగ్ 11లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. నితీశ్‌కు చోటు లభించకపోతే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందని యాష్ అభిప్రాయపడ్డాడు. రాంచిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కింది.
Also Read: Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేడు. అతడి స్థానంలో మరో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఎంపిక చేశారు. నితీశ్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదంటే కచ్చితంగా జట్టులో ఎంపికలో ఏదో తప్పుగా జరుగుతోంది. అవకాశం ఇవ్వనప్పుడు నితీశ్‌ని ఎందుకు జట్టుకు ఎంపిక చేశారు?. హార్దిక్ లేని లోటును అతను పూడ్చగలడు. అవకాశాలు ఇస్తేనే మెరుగవుతాడు. కానీ అలా జరగడం లేదు. తుది జట్టులో నితీశ్‌కు చోటు లభించకపోతే.. జట్టు ఎంపికపై కచ్చితంగా సమీక్షించాల్సి ఉంటుంది’ అని అన్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 3న రాయ్‌పుర్‌లో రెండో వన్డే జరగనుంది.
