KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!

Kl Rahul, Devdutt Padikkal

Kl Rahul, Devdutt Padikkal

KL Rahul Creates Record in Wellington: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. దీంతో సేనా దేశాల (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై భారత ఓపెనర్లు తొలి రెండు వికెట్లకు రెండు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

గతంలో ఈ ఘనతను సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సాధించారు. 1979లో ది ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్–చేతన్ చౌహాన్ జోడీ 213 పరుగులు, గవాస్కర్–దిలీప్ వెంగ్‌సర్కార్ జోడీ 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అలాగే 1985-86లో సిడ్నీలో జరిగిన టెస్టులో గవాస్కర్–కృష్ణమాచారి శ్రీకాంత్ జోడీ 191 పరుగులు, గవాస్కర్–మొహిందర్ అమర్‌నాథ్ జోడీ 224 పరుగులు జోడించింది. 2003-04లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్–ఆకాశ్ చోప్రా జోడీ 141 పరుగులు, సెహ్వాగ్–రాహుల్ ద్రవిడ్ జోడీ 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాయి. ఇప్పుడు 2026లో వెల్లింగ్టన్ టెస్టులో కేఎల్ రాహుల్–యశస్వి జైస్వాల్ జోడీ 130 పరుగులు, రాహుల్–దేవదత్ పడిక్కల్ జోడీ 165 పరుగులు జోడించి ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

అంతేకాదు న్యూజిలాండ్ గడ్డపై ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమైన భారత బ్యాటర్ల జాబితాలోనూ లోకేష్ రాహుల్ చేరాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ 1998-99లో హామిల్టన్‌లో, గౌతమ్ గంభీర్ 2009లో వెల్లింగ్టన్‌లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు రాహుల్ కూడా 2026 వెల్లింగ్టన్ టెస్టులో ఈ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ మూడో రోజు మూడో సెషన్ ఆట కొండగుతోంది. భారత్ 90 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 119.. శుభ్‌మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది.