న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో టీమిండియా క్రికెటర్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న విశాఖకు చేరుకున్న ఇరు జట్లు.. ప్రస్తుతం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. బుధవారం (జనవరి 28) ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. వైజాగ్‌లోని వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో భారత క్రికెటర్లు ‘బార్డర్’ మూవీని వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందే!
టీమిండియా క్రికెటర్ల కోసం వరుణ్ ఇనాక్స్ థియేటర్ యాజమాన్యం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ షోను టీమిండియా స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి సహా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చూశారు. థియేటర్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించిన ప్లేయర్స్.. అభిమానుల దృష్టిని మరింత ఆకర్షించారు. మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్ల మోమెంట్స్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
