నాగ్‌పుర్ వేదికగా భారత్-న్యూజిలాండ్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి వికెట్ అని, ఎక్కువ స్కోరింగ్ చేసేలా కనిపిస్తోందని సాంట్నర్ చెప్పాడు. భారత్‌కు వచ్చి గెలవడం ఎంత కష్టమో ప్రతి జట్టుకు తెలుసు అని, గత వారం చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. ఇది తాజా సిరీస్ అని, స్వదేశంలో టీమిండియా కఠినమైన జట్టు తెలిపాడు. ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా ఉపయోగపడనుందని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మేము ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంచు కురుస్తుందని తెలుసు. అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ చేసినా.. బోర్డుపై ఎక్కువ పరుగులు ఉంచుతాం. ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ బెంచ్‌లో ఉంటారు’ అని తెలిపాడు. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్ అయినా పట్టాలని చూస్తోంది. టీ20 సిరీస్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో భారత్‌కు ఇది ఎంతో కీలకం.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే (కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డరెల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ.