NTV Telugu Site icon

IND vs AUS: భారత్, ఆసీస్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దయితే ఆ జట్టుకు పండగే..!

Ind

Ind

IND vs AUS, Saint Lucia Weather Forecast: సూపర్ 8 లో నేడు భారత్, ఆస్ట్రేలియా సెయింట్ లూసియాలో తలపడనున్నాయి. అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అంటే, భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) సూపర్ 8 రౌండ్‌లో జరగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టీంకు అత్యంత కీలక మైనది. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం పడుతుండటంతో ఈ మ్యాచ్‌ రద్దు అవుతుంది అని భయం అందరి దృష్టిలో ఉంది.. అంతే కాకుండా వాతావరణ నివేదికల ప్రకారం, సెయింట్ లూసియాలో ఈ రోజు ఉదయం వర్షం పడే అవకాశం 55 శాతంగా ఉంది.

Also Read; IND vs AUS: నేడు భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్.. గెలిస్తేనే కంగారులను సెమీస్‌ ఆశలు!

ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీలుగా ఉంటుంది. అంటే మ్యాచ్ జరిగేయ్ సమయంలో కూడా వర్షం పడవచ్చు. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ 5 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే సెమీఫైనల్ కి ఆఫ్ఘానిస్తాన్ చోటు సంపాదించుకుంటుంది. అలానే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

రెండు జట్లు..
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.