Site icon NTV Telugu

Teja Nidamanuru: నెదర్లాండ్స్ జట్టులో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు ..

8339 Teja Nidamanuru 58runs

8339 Teja Nidamanuru 58runs

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. షాయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగడంతో విండీస్ విక్టరీ కొట్టింది. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 45ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా నెదర్లాండ్స్ 247 లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు పెట్టింది.

అయితే ఈ మ్యాచ్‌లో మన తెలుగు తేజం తేజా నిడమనూరు ఆకట్టుకున్నాడు. విజయవాడకు చెందిన అనిల్ తేజ నిడమనూరు క్రికెట్ మీద చిన్నప్పటినుండి అమితంగా ఆసక్తి కనబరిచేవాడు. అతను తొలుత న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. తరువాత నెదర్లాండ్స్ వెళ్లి అక్కడ జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన తేజ.. తొలి మ్యాచ్‌లోనే 51బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 58పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భవిష్యత్తులో మంచి ప్లేయర్ ఎదుగుతాడని నమ్మకాన్ని ఇచ్చేలా తేజా నిడమనూరు ధాటిగా ఆడి.. నెదర్లాండ్స్ జట్టు స్కోరును 240 పరుగులకు చేర్చాడు.

Exit mobile version